Prakasam Barrage Works Updates :ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు ప్రక్రియ ఇవాళ పూర్తి కానుంది. పడవలు ఢీకొనడంతో ధ్వంసమైన 3 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వాటిలో కాంక్రీటు వేసే పని పూర్తిచేస్తే లక్ష్యం నెరవేరుతుంది. కనీసం వారం రోజులు పట్టే పనుల్ని కేవలం 4 రోజుల్లోనే పూర్తిచేసేలా అధికారులు రేయింబవళ్లు సాహసోపేతంగా పనిచేస్తున్నారు.