Prakasam Barrage Boats Incident: ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. లంగర్ వేయకుండా పడవలను కావాలనే వదిలేశారని, బోటు యజమాని వైఎస్సార్సీపీ నేత కావడం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇలాంటి దుర్మార్గపు పనులు చేసేది చరిత్ర వైఎస్సార్సీపీ దేనని, ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి నిందితులను శిక్షిస్తామన్నారు.