MINISTER NIMMALA RAMA NAIDU HEALTH: అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జ్వరంతో ఉండి, చేతికి కాన్యులా పెట్టుకుని మంత్రి నిమ్మల సభకు హాజరయ్యారు. గోరకల్లు రిజర్వాయర్ రక్షణ గోడ నిర్మాణంపై శాసనసభలో మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చిన అనంతరం సభలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చేతికి కాన్యులా పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలకు మంత్రి హాజరు అవడంతో విశ్రాంతి తీసుకోవాలంటూ మంత్రి లోకేశ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు కోరారు.