Minister Nimmala Ramanaidu Visit Mogaltur in West Godavari District : జగన్ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా విధ్వంసం చేసి రైతులను గాలికి వదిలేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో మొగల్తూరు మురుగు డ్రెయిన్, మట్టి తొలగింపు ప్రక్షాళన పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. ఈ డ్రైన్ ప్రక్షాళనకు రూ 2. కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.