Minister Lokesh Participated in Closing ceremony of Temple Expo : ఆలయాలను భక్తులకు మరింత చేరువ చేసేలా రాష్ట్రంలో ఎన్టీయే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల దర్శన టిక్కెట్లును వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే టీటీడీ సేవలు సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. తిరుపతిలో మూడురోజులపాటు జరిగిన టెంపుల్ ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. డ్రోన్లు, ఏఐ వినియోగంతో భక్తుల రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తుల భద్రత, ఆలయ పాలన సేవల కోసం మరింత సమర్థంగా సాంకేతిక సేవలు వినియోగించుకుంటామని తెలిపారు.