ప్రపంచ తెలుగు మహాసభలు : అసదుద్దీన్ తెలుగు స్పీచ్ అదుర్స్ ! ప్రత్యేక ఆకర్షణ

  • 6 years ago
MP and All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) president Asaduddin Owaisi spoke in Telugu at the inaugural ceremony of the World Telugu Conference on Friday.

ప్రపంచ తెలుగు మహాసభల్లో శుక్రవారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఏ వేదికపై కూడా తెలుగులో మాట్లాడని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తొలిసారిగా పూర్తిగా తెలుగులోనేగా ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌ ఎల్‌బీ మైదానంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్‌, కేటీ రామారావు, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, జితేందర్‌రెడ్డి, కేశవరావు, అసదుద్దీన్‌ ఒవైసీ, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కవులు, కళాకారులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.

Recommended