ప్రపంచ తెలుగు మహాసభలు : NTR నే మరిచిపోయారా ?

  • 6 years ago
Telangana CM K Chandra skhar Rao has inclined to invite Andhra Pradesh CM Nara Chandrababu Naidu to The World Telugu Conference. Meanwhile NT Rama Rao fans at Vijayawada protested for ignoring NTR on the occassion of World Telugu Conference.

ప్రపంచ తెలుగు మహాసభలు ఈరోజు హైదరాబాదులో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. హైదరాబాదులోని లాల్ బహుదూర్ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, తెలుగుభాషా పిపాసులు హాజరవుతున్నారు.. అయితే, మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రారంభ వేడుకకు ఆహ్వానించే అవకాశం లేదని అర్థమవుతోంది. ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, సభాధ్యక్షులుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ సదస్సుకు విశిష్ట అతిథులుగా హాజరవుతున్నారు.
మహాసభల ముగింపు వేడుకకు చంద్రబాబునాయుడుని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. ముగింపు సమావేశానికి రాష్ట్రపతి కోవింద్ వస్తున్నారు. దానికి చంద్రబాబును ఆహ్వానించే అవకాశం ఉందని అంటున్నారు.

Recommended