Miss World contestants at Buddhavanam : మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ బుద్ధవనంలో పర్యటించారు. వారికి గిరిజన, జానపద నృత్య కళాకారులు ఘనస్వాగతం పలికారు. వారంతా అక్కడి పరిసరాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. బౌద్ధ థీమ్‌పార్క్‌లోని బుద్ధ విగ్రహాల వద్ద జరిగిన ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.