Miss World 2025 Pageant : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, నగర వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో 72వ మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా చార్మినార్ పరిధిలో మిస్‌వరల్డ్ హెరిటేజ్ వాక్ చేపట్టింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సుందరీమణులు చార్మినార్ వద్దకు చేరుకోగా అరబ్బీ మార్ఫావాయిద్యాల సందడితో రెడ్‌కార్పెట్ స్వాగతం పలికారు. అక్కడ అందగత్తెలతో ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహించారు. అనంతరం చార్మినార్‌లోకి వెళ్లి అరగంటకు పైగా ఉన్నారు. చార్మినార్ అందాలను వీక్షించడంతోపాటు నిర్మాణ నేపథ్యం తదితర అంశాలను తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చార్మినార్ నుంచి చుడీబజార్-లాడ్‌బజార్ మీదుగా చౌమొహల్లా ప్యాలెస్ వరకు 40 నిమిషాలు హెరిటేజ్ వాక్‌లో సందడి చేశారు.