Five Youngsters Missed in Godavari River : పండగ పూట తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగి. ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ ఐదుగురూ గల్లంతయి మృతి చెందారు. కాగా ఆరుగురు యువకులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.