Minister Tummala On Loan Waiver : రైతులను ఆదుకుంటున్న తమ ప్రభుత్వానికి సహకరించకపోగా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. రుణమాఫీపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. మూడు విడతల్లో రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని వెల్లడించారు.