Minister Satya kumar Yadav Started Mother Milk Bank in Anantapur sarvajana Hospital : వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో గాడితప్పిన ప్రభుత్వ ఆసుపత్రులను చక్కదిద్దుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. అనంతపురం సర్వజనాసుపత్రిలో తల్లిపాల బ్యాంకు, శుద్ధనీటి ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఖాళీలు ఉన్నాయని ఓ పత్రిక రాస్తోందని, ఇది ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలన వైఫల్యమని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన పదినెలల్లో వైద్యులు, నర్సింగ్ ఇతర సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు.