64 Maoists Surrender at Bhadradri Kothagudem District SP Office : తెలంగాణ, ఛత్తీస్గడ్ సరిహద్దులో మావోయిస్టు పార్టీలో పని చేసే 64 మంది భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. వీరిలో ఏసీఎం సభ్యులు సహా పార్టీ సభ్యులు ఉన్నారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారని ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దీనికి జిల్లా ఎస్పీ, సీఆర్పీఎఫ్ వారు సంయుక్తంగా కృషి చేశారని అన్నారు. లొంగిపోయిన 64 మందిలో 48 మంది పురుషులు, 16 మంది స్త్రీలు ఉన్నారు.