Bhavani Deeksha Viramana 2024 : విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణలు ఘనంగా ముగిశాయి. చండీహోమం మందిరంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన భవానీదీక్ష విరమణలో మండల దీక్ష, అర్ధమండల దీక్ష వహించిన భవానీమాలదారులు పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో దీక్షలను విజయవంతం చేయగలిగామని ఆలయ ఈవో కేఎస్ రామరావు తెలిపారు.