Dasara Sharan Navaratri Celebrations Starts in Vijayawada Indrakeeladri : అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా శోభను సంతరించుకుంది. శరన్నవరాత్రి మహోత్సవాల వేళ భక్తులతో కిటకిటలాడుతోంది. శక్తిపీఠాలలో ఒకటిగా విజయవాడ కనకదుర్గాదేవి ఆలయానికి పేరు. నేటి నుంచి ఈనెల 12 వరకు రోజుకో అలంకరణతో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి బాలాత్రిపుర సుందరీదేవి అలంకరణతో దసరా ఉత్సవాల దర్శనాలు ప్రారంభమవుతాయి. ఇంద్రకీలాద్రి దిగువన వినాయక ఆలయం వద్ద నుంచి క్యూలైన్లు వేశారు. భక్తులు అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ ఘాట్‌రోడ్డు మీదుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.