విజయవాడలో వీ- ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా దాండియా 2024 ఫెస్టివల్ కోలాహలంగా జరిగింది. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా దాండియా నృత్యం చేశారు. చిన్నారులు చేసిన నవ దుర్గ అవతారాల ప్రదర్శన చూపురులను ఆకట్టుకుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా వీ- ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా దాండియా ఫెస్టివల్ సందడి సాగింది. గాంధీనగర్లోని ఓ హోటల్లో దాండియా 2024 ఫెస్టివల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.