ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. వేలాది మంది భక్తులు వీధుల్లో చేరి సిరిమానును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గజపతుల కుటుంబీకుల తరఫున పూసపాటి అశోక్‌గజపతిరాజు, ఆనంద గజపతిరాజు సతీమణి సుధా గజపతిరాజు పుట్టింటి ఆడపడుచు మొక్కులు చెల్లించగా...ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.