Story On Manjeera Wild Life Sanctuary : చుట్టూ పక్షుల కిలకిలరావాలు, నెమళ్ల నాట్యాలు అడవి కోళ్ల కొక్కొరోక్కోలు పచ్చని అడవి. పక్కనే హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే మంజీరా నది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలకు అనుమతులు లేవు. అంత సుందరమైన స్వచ్ఛమైన ప్రాంతం మంజీర అభయారణ్యం. సింగూరు నుంచి మంజీర వరకు 9 ద్వీపాలు ఉండటం ఇక్కడ విశేషం. ఈ ద్వీపాల్లో జింకలు, కొండచిలువలు, తాచుపాములు, దుప్పులు, అడవి పిల్లి, నక్కలు ఇంకా అనేక జంతువులు, సరీసృపాల సమాహారం మంజీర పరివాహకం. త్వరలో ఈ మంజీర అభయారణ్యం జాతీయ స్థాయిలో గుర్తింపునకు సిద్ధమవుతోంది. జాతీయ స్థాయి జాబితాMANJEERA WILD LIFE SANCTUARY లో చేరితే మరింత సుందరంగా ఈ అభయారణ్యం ముచ్చటగొలుపుతోంది.