Tirupati Gangamma Temple development on TTD funds : తిరుమల తిరుపతి దేవస్థాన నిధులతో తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి చేస్తామని టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి 14కోట్ల రూపాయల నిధులు కావాలని రెండు నెలల క్రితం ఎమ్మెల్యే తనని కోరినట్లు ఆయన గుర్తుచేశారు. 24న జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గంగమ్మ ఆలయాన్ని సందర్శించిన ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్ధప్రసాదాలను అందజేశారు.