Actress Samantha Visited Tirumala Temple : తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీనటి సమంతతో పాటు ఆమె నూతనంగా నిర్మిస్తున్న శుభం చిత్ర బృందం స్వామివారి సేవలో పాల్గొంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కూడా సమంత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచారణలతో ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. సమంతతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.