Prakasam Barrage Gates Repair Works Speed Up in Vijayawada : ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మధ్య చిక్కుకున్న బోట్లను తొలగించేందుకు ఇంజినీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కీలకమైన 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను కన్నయ్య నాయుడు సారథ్యంలో అధికారులు విజయవంతంగా అమర్చారు. పైనుంచి జోరు వర్షం కురుస్తున్నా, కింద లక్షన్నర క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నా తాడు, క్రేన్లు సాయంతో రంగంలోకి దిగి సాహసోపేతంగా పనిచేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.