Baahubali Bridge on Krishna River At Vijayawada : అమరావతిలో జరిగే వేడుకను కనులారా వేక్షించేందుకు ఉభయగోదావరి, హైదరాబాద్ వైపు నుంచి రాజధానికి వచ్చే ప్రజానికానికి శుభవార్త. మీరు అమరావతిలోకి అడుగుపెట్టేందుకు బెజవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేదు. నగరంలో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకయాతన పడాల్సిన పరిస్థితీ కనిపించదు. విజయవాడ శివారు చిన్నవుటపల్లి వద్ద పశ్చిమ బైపాస్ ఎక్కితే చాలు రయ్ రయ్ మంటూ దూసు కెళ్లవచ్చు.