Barrages on Krishna River: కృష్ణా నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగుకు జీవనాడి. ఈ ఏడాది ఈ నదిపై మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులూ పూర్తిగా నిండాయి. కొన్నేళ్లుగా ఎగువ రాష్ట్రాల నుంచి మనకు ఇంత భారీస్థాయిలో వరద రావడం చాలా అరుదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన వరద సముద్రంలోకి వృథాగా వెళ్లకుండా ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో బ్యారేజీలు కట్టి నీటిని నిలబెట్టి కృష్ణా డెల్టాలో సాగుకు ఇబ్బంది లేకుండా చూడాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. అంచనాల తయారీతోపాటు అనుమతులూ లభించాయి. కానీ వైఎస్సార్సీపీ సర్కార్ నిర్లక్ష్యంతో జలాశయాల ఆలోచన అటకెక్కింది. నీటి వృథా యథాతథంగా సాగిపోతోంది.