Collision of Boats in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడంపై అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. అసలు ఆ పడవలు ఎవరివి ఎందుకు వచ్చాయి? ఎవరైనా కావాలని వదిలేశారా లేక నదీ ప్రవాహానికి కొట్టుకొచ్చాయా ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే వాటికి వైఎస్సార్సీపీ రంగులు ఉండటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలన్న ఇంజినీరింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు.