Central Govt Approves Amaravati Railway Project: అమరావతి రైల్వే అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 వేల 245 కోట్ల రూపాయలతో 57 కి.మీ అమరావతి రాజధానికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ కొత్త లైన్ నిర్మాణం జరగనుంది. ఈ లైన్ ద్వారా దక్షిణ భారతాన్ని మద్య, ఉత్తర భారతంతో అనుసంధానం మరింత సులువు కానుంది. అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ద, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చెందనుంది. అమరావతికి రైల్వేలైన్ మంజూరు కావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.