Road Connectivity in Amaravati: అమరావతి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పెనుమాక- తాడేపల్లి మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తిచేసి కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారితో కలపాలని భావిస్తోంది. ఉండవల్లి- వెంకటపాలెం మధ్య కరకట్ట రోడ్డు విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ మార్గాల్లో భూసేకరణ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. సామరస్యంగా ఈ సమస్యలను అధిగమించి, రాజధానిలో రోడ్ల కనెక్టివిటీని పూర్తిచేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.