Amaravati Startup Area Works : రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియాగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ నిర్మాణంపై మళ్లీ కార్యాచరణ ప్రారంభమైంది. ఇటీవలే సింగపూర్ ప్రతినిధులు రాజధానిలో పర్యటించడంతో సీబీడీపై మళ్లీ కదలిక వచ్చినట్టు సమాచారం. సంపద సృష్టి కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో గతంలో టీడీపీ ప్రభుత్వం సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆర్థిక లావాదేవీల కేంద్రంగా సీబీడీ పేరిట ఓ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సైతం రూపొందించింది. దీన్ని డెవలప్మెంట్ చేసేందుకు సింగపూర్ కన్సార్షియం ముందుకొచ్చింది.