BITS Campus in Amaravati : రాజధాని అమరావతి పనులు చకాచకా జరిగేలా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రతిష్ఠాత్మక సంస్థలు వరుస కడుతున్నాయి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్- బిట్స్ క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ 35 ఎకరాలు కేటాయించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాలనూ దేవాలయం నమూనాలో నిర్మిస్తామని ప్రతిపాదించింది. మరిన్ని యూనివర్సిటీలు, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు రాజధానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల ఏర్పాటుకూ రంగం సిద్ధమవుతోంది.