AP Capital Amaravati Works: అమరావతిలో నిర్మాణాలను పునఃప్రారంభించేందుకు సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ఈనెల12 నుంచి రాజధాని పనులు ప్రారంభంకానున్న నేపథ్యంలో, ప్రైవేటు సంస్థలు కూడా విస్తరణ చర్యలు చేపట్టాయి. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం 700 కోట్లతో కొత్త విభాగాలను నిర్మించేందుకు సిద్ధమైంది. ఈనెల 11న సీఎం చంద్రబాబు వీటికి శంకుస్థాపన చేయనున్నారు. రాజధానిలో పలు సంస్థలు సైతం అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాయి.