CM Chandrababu Meeting With Capital Amaravati Farmers : రాజధాని పునఃప్రారంభ వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి రావాలంటూ భూములిచ్చిన అమరావతి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఉండవల్లిలోని తన నివాసంలో అమరావతి అన్నదాతలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశం వీరి మధ్య చర్చకు రాగా 2024 వరకు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి అన్నట్టు రైతులు తెలిపారు.