Chandrababu Delhi Tour : అమరావతికి ప్రపంచబ్యాంకు ద్వారా నిధులు సమకూర్చడానికి, పోలవరం తొలిదశ పనులు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపింది. డిసెంబర్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన జరగనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్లతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలకు చెప్పారు.