Chandrababu on Delhi Elections : సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు వివరించారు. ఎవరికి ఓట్లు వేస్తే డెవలప్మెంట్ జరుగుతుందో ఆలోచించాలన్నారు. దిల్లీలో వాతావరణ కాలుష్యంతోపాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందని చెప్పారు. అభివృద్ధికి దేశ రాజధాని ఆమడదూరంలో ఆగిపోయిందని సమస్యల వలయంలో చిక్కుకుందని తెలిపారు. డెవలప్మెంట్ కావాలంటే బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు. హస్తినలో కమలం గెలుపు దేశ ప్రగతికి మలుపని అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.