వ్యవసాయానికి జీవనాధారమైన సాగునీటికి నదులు అనుసంధానమే ఏకైక పరిష్కార మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గోదావరి- కృష్ణా- పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోనున్నాయని...దీనికి కేంద్రం ఆర్థికంగా అండగా నిలబడాలని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ను ఆయన కోరారు. అలాగే దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ సంస్థలను ఏపీకి పంపాలని జైశంకర్‌ను కలిసి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు