CM Revanth Reddy Inaugurated Bhu Bharathi Portal : భూభారతిపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ప్రయోగాత్మకంగా ప్రారంభించే 4 మండలాల్లో సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాకు ఇంచార్జి మంత్రుల ఆమోదం ఉండాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ పర్యవేక్షణకి ప్రతీ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.