CM Chandrababu Bapatla District Tour : సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా ఏప్రిల్ ఒకటో తేదీన బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. చినగంజాం మండలం పెదగంజాం పంచాయతీ పరిధిలోని గొల్లపాలెంలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. సీఎం రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. హెలీప్యాడ్, ప్రజలతో నిర్వహించే ప్రజావేదిక, పార్టీ నాయకులు, అధికారులతో నిర్వహించే సమావేశపు ప్రాంతాలను పరిశీలించారు.