Government Focuses on Amaravati Capital Construction Works : రాజధాని అమరావతిలో నవ నగరాలతో పాటు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీ వస్తున్న వేళ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజధాని గ్రామాల్లో రహదారులు బాగు చేస్తున్నారు. ప్రజలు వేదిక వద్దకు చేరుకునే మార్గాలను ముస్తాబు చేస్తున్నారు. ప్రధాని సభ కోసం రాజధాని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాజధాని అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.