PM Modi on AP Development : ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దేశానికే మార్గదర్శకంగా అమరావతి రూపొందుతుందన్నారు. ఎన్టీఆర్ కలలుకన్న వికసిత్ ఆంధ్రపదేశ్‌ను ఆవిష్కరిస్తామన్నారు. అమరావతి రాజధానిలో చేసిన శంకుస్థాపనలు కేవలం కాంక్రీటు నిర్మాణాలు మాత్రమే కాదని దేశ ప్రగతికి కీలక పునాదులని వ్యాఖ్యానించారు. వెలగపూడి సభావేదికగా రాజధానిలో వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మళ్లీ ఏపీకి వస్తానని తెలిపారు.