PM Modi Relaunch Amaravati Works : రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆంధ్రుల ఆశలకు, ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పునః ప్రారంభ సభలో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయ, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.49,040 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు.