PM Modi Amaravati Tour 2025 : నాది ఆంధ్రప్రదేశ్ నా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రుడూ సగర్వంగా చెప్పుకొనేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాజధాని ప్రయాణం మొదలవుతోందని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలతో ఆంధ్రుల స్వప్నాన్ని దెబ్బతీయలేరని చాటి చెప్పేందుకే ప్రధాని మోదీ చేతుల మీదుగా మే 2న అమరావతి పనులు పునఃప్రారంభించనున్నట్లు వివరించారు.