Chandrababu on P-4 Policy : పీ-4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నారావారిపల్లెలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో కందులవారిపల్లె, ఎ.రంగంపేట, చిన్నరామాపురం గ్రామాల అభివృద్ధిపై కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన చర్చించారు. కృత్రిమ మేధను అందరూ అందిపుచ్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.