Tirupati Stampede Due to YSRCP Government Decisions : వైఎస్సార్సీపీ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు శ్రీవారిని సామాన్య భక్తులకు దూరం చేసేలా వ్యవహరించారనే విమర్శలున్నాయి. గత ప్రభుత్వ విధానాలనే కూటమి ప్రభుత్వం కొనసాగించడం. తిరుపతి తొక్కిసలాటకు ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఉన్న వైకుంఠ ద్వారా దర్శనాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 10 రోజులకు పెంచి వైకుంఠ ద్వార దర్శనానికి ఉన్న విశిష్టతను దెబ్బతీసిందన్న విమర్శలు ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగించింది. గత సర్కార్ విధానాలను సమీక్షించి భక్తులకు మెరుగైన రీతిలో దర్శనం కల్పించేలా నిర్ణయాలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యం నిండు ప్రాణాలను బలితీసుకొందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.