ఈ 5ఏళ్ళు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ నేతలు మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు.... హేయమైన చర్యని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడిగి తెచ్చుకునేది కాదని.. ప్రజలు ఇస్తే వచ్చేదని తేల్చిచెప్పారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వైసీపీకి వచ్చేదని గుర్తుచేశారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వైసీపీ గుర్తించాలని హితవుపలికారు.