Raghu Rama Krishna Raju Comments : ఉండి నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు పంట కాలువలపై ఆక్రమణ తొలగింపు చేపట్టామని ఎమ్మెల్యే, శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద అమిరంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల ఇళ్లను దురుద్దేశంతో కూల్చి వేస్తున్నామని సీపీఎం నాయకులు దుష్ప్రచారం చేయడం తగదన్నారు.