Minister Nara Lokesh Comments on Mangalagiri Development : భారీ మెజారిటీతో గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రాబోయే వంద రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో జైన్ల ఆధ్వర్యంలో నిర్మించిన భగవాన్ మహావీర్ గోశాలను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి లోకేశ్ ప్రారంభించారు. హోలీ పండుగ సందర్భంగా చిన్నారులు మంత్రి నారా లోకేశ్‌కి రంగులు పూశారు. అనంతరం మార్వాడీలు మంత్రి నారా లోకేశశ్ను, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఘనంగా సన్మానించారు.