Kishan Reddy on BR Ambedkar Jayanti celebrations in AP : దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందన్న విమర్శలు సరి కాదని, బీజేపీ శ్రేణులు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. దక్షిణ భారతానికి బీజేపీ అన్యాయం చేస్తుందని, పార్లమెంట్ సీట్లు కుదిస్తారని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాదిలో కూడా బీజేపీ విస్తరిస్తుందని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వస్తామని, తమిళనాడులో డీఎంకేను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.