Nandamuri Balakrishna on Padma Bhushan Award : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సినీ రంగానికి చేసిన సేవలకు గానూ నటుడు బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిదే . ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బంది బాలకృష్ణ దంపతులను సత్కరించారు. తనకు పదవులు అలంకారం కాదని పదవులకే తాను అలంకారం ఏమో అని అన్నారు.