JD Lakshminarayana on Telugu : సహజసిద్ధంగా వచ్చే భాషే మాతృభాషని విశ్రాంత ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మినారాయణ అన్నారు. అమ్మ అనే పదంలో ఉన్న మాధుర్యం మమ్మీలో రాదన్నారు. పసితనంలో మాతృభాషను చంపేయడం భ్రూణహత్యతో సమానమన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలలో ఆయన పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్ధి, భాష పరిరక్షణ, రాజకీయ నాయకుల పాత్రపై ఆయన మాట్లాడారు.