Chandrababu on Veeraiah Chowdary : ఒంగోలులో మంగళవారం నాడు టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తన స్వస్థలమైన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు తరలించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి చేరుకొని వీరయ్య చౌదరి మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు.