Satyavardhan Kidnap Video Release : పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తి చేయాలనుకుంటే ఊరుకునేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వల్లభనేని వంశీతో పాటు అందరి బాగోతాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. ప్రశాంతమైన కృష్ణా జిల్లాలో అల్లర్లకు యత్నిస్తే సహించమన్నారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లిన సీసీటీవీ ఫుటేజీని ఆయన విడుదల చేశారు. ఈ నెల 11న మై హోమ్ భుజాలో రికార్డైన దృశ్యాలను కొల్లు బయట పెట్టారు.