CM CHANDRABABU NAIDU SPEECH: పార్టీ ఆవిర్భావం నుంచీ ఎన్నో సంక్షోభాలు ఎదురైనా తెలుగుదేశం ఎన్నడూ వెన్నుచూపలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 43 ఏళ్లుగా సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు పసుపు జెండా ఆవిష్కరించారు. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడిన చంద్రబాబు తెలుగువారు ఉన్నంతవరకు పార్టీ ఉంటుందని ఉద్ఘాటించారు.